
2010లో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది(Sampath Nandi). వచ్చీరాగానే వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్‌తో ‘ఏమైంది ఈవేళ’ మూవీ తీశాడు. అయితే ఇది ఆయనకు షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్(Box office) వద్ద అనుకున్న మేర సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో ‘రచ్చ(Raccha)’ మూవీని తెరకెక్కించాడు. ఆ తర్వాత 2015లో రవితేజ(Ravi Teja) కథానాయకుడిగా ‘బెంగాల్ టైగర్’, 2017లో గోపీచంద్(Gopi chand)తో ‘గౌతమ్ నంద’ను రూపొందించాడు. ఇక 2021లో ‘సీటీమార్’తో ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆ తర్వాత డైరెక్టర్‌గా ఆయన కాస్త సైలెంట్ అయ్యాడు. అయితే TALIPATAM, పేపర్ బాయ్, సింబా (2024) సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఆయన ‘ఓదెల-2(Odela2)’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అందుకే నేనే కన్విన్స్ అయ్యా: సంపత్ నంది
తాజాగా ఈ మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది తాను తీయాలనుకున్న ‘గాంజా శంకర్’ గురించి పలు విషయాలు షేర్ చేశాడు. సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej)తో ‘గాంజా శంకర్(Ganja Shankar)’ తీయాలనుకున్నాని కానీ టైటిల్‌పై పోలీసుశాఖ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపాడు. అందుకే ఆ సినిమాను ఆపేసి తమన్నాతో శక్తిమంతమైన మూవీ తీసినట్లు చెప్పాడు. ‘నేను అనుకున్న కథలో కంటెంట్ ఏంటో పోలీసులకు తెలియదు. కానీ టైటిల్ మార్చమని నాకు, హీరోకు నోటీసులిచ్చారు. వారిని కన్విన్స్ చేయడం కంటే నేనే కన్విన్స్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘గాంజా శంకర్’ ఆపేసి శంకరుడి మీదే ఓదెల-2 మూవీని తెరకెక్కించా’ అని క్లారిటీ ఇచ్చాడు.
#GaanjaShankar టైటిల్ మార్చమని పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి మాకు నోటీసులు వచ్చాయి.. అందుకే ఆ సినిమా ఆపేశాం – #SampathNandi pic.twitter.com/bKLnjpvfKc
— Rajesh Manne (@rajeshmanne1) March 22, 2025
నాగసాధువు పాత్రలో తమన్నా
కాగా ఓదెల-2లో దుష్టశక్తిని అడ్డుకునే శివశక్తి అనే నాగసాధువు పాత్రలో తమన్నా(Thamanna) నటించింది. ఆమె శక్తిమంతమైన క్యారెక్టర్ చేశారంటూ డైరెక్టర్ కొనియాడాడు. కాగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీలో లీడ్ రోల్ చేసిన హెబ్బా పటేల్(Hebba Patel) ఈ సీక్వెల్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. విశిష్ట సింహ, మురళి శర్మ, శరత్ లోహస్విత, నాగ మహేశ్, గగన్ విహారి కూడా ఈ చిత్రంలో కీరోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అటు మేకర్స్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.