డేవిడ్ వార్నర్(David Warner).. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్ని సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్ నాయకత్వంలోనే 2016లో SRH ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పాటలు, డైలాగ్‌లను రీల్స్ చూస్తూ అందరినీ అలరించాడు. కాగా నేడు (March 23) రాజస్థాన్ రాయల్స్(RR)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
‘రాబిన్ హుడ్’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ
కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వార్నర్ కేవలం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న T20 లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ఐపీఎల్ మెగా(IPL Mega Auction) వేలం 2025లో వార్నర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్ 2025లో అతడు ఆడడం లేదు. ఐపీఎల్ ద్వారా కాకుంటేనేం.. సినిమా ద్వారా అలరించేందుకు వార్నర్ సిద్ధం అయ్యాడు. నితిన్(Nitin) హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్(Rabinhood)’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో వార్నర్ అడుగుపెట్టాడు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నితిన్, శ్రీలీలతో కలిసి వార్నర్ ప్రమోషన్
ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని HICC నోవాటెల్లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event) జరగనుంది. ఈవెంట్‌లో హాజరు అయ్యేందుకు వార్నర్ HYDలో అడుగుపెట్టాడు. కాగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొనేకంటే ముందుగానే IPLలో వార్నర్ సందడి చేయనున్నాడు. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల(Sreeleela)తో కలిసి వార్నర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్‌లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మ్యాచ్‌కు సంబంధించిన విషయాలతో పాటు సినిమా ప్రమోషన్స్(Promotions)ను వార్నర్ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.






