ILP: టీమ్ఇండియా ప్లేయర్‌కు జాక్‌పాట్.. LSGలోకి శార్దుల్ ఠాకూర్

టీమ్ఇండియా ప్లేయర్ శార్దుల్ ఠాకూర్(Shardul Thakur) IPLలో జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ 2025 మెగా వేలం(Mega Auction)లో ఈ బౌలర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్(LSG) మోసిన్ ఖాన్ కాలిగాయంతో ఈ సీజన్‌లో చాలా మ్యాచులకు అతడు దూరమయ్యాడు. దీంతో రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) ఆప్షన్ ద్వారా శార్దూల్‌ను LSG తమ టీమ్‌లోకి తీసుకుంది. ఇందుకు అతడికి రూ. 2 కోట్లు చెల్లించనుంది. దీంతో శార్దుల్ నక్కతోక తొక్కివచ్చాడంటూ పలువురు నెటిజన్లు ఆయనపై సరదాగా ట్వీట్ చేస్తున్నారు.

శార్దూల్ అభిమానులు ఫుల్ హ్యాపీ

కాగా.. శార్దూల్ ఠాకూర్ దేశీయ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ముంబై(Mumbai) తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన ప్రతిభను కనబరిచాడు. శార్దూల్ ఠాకూర్ ఇటీవల LSG శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియా(SM)లో విపరీతంగా షేర్ అయ్యాయి. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు.. లక్నో జట్టులో చేరుతున్నట్లు అనుకున్నారు. చివరకు అదే నిజం కావడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Ranji Trophy 2024-25 - Another day, another audacious Mumbai rescue act by Shardul  Thakur | ESPNcricinfo

గాయాలతో ముగ్గురు కీలక ప్లేయర్లు దూరం

ఇప్పటికే LSGలో కీలక బౌలర్లు అయిన అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్ గాయాలతో బాధపడుతున్నారు. అవేష్, ఆకాష్ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. మయాంక్ యాదవ్(Mayank Yadhav) కూడా సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. శార్దుల్ ఠాకూర్‌ జట్టు బౌలింగ్ బాధ్యతలు మోస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. కాగా ఈ సీజన్‌లో LSG తమ మొదటి మ్యాచ్‌ను రేపు (మార్చి 24) వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో ఆడనుంది.

IPL 2023: Pacer Mohsin Khan to join Lucknow Super Giants for remaining  games | Cricket News - Times of India

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *