అంతా అనుకున్నట్లే జరిగింది.. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో పరుగుల సునామీ వచ్చింది. ఐపీఎల్‌లో హార్డ్ హిట్టింగ్‌కు మారుపేరైన సనరైజర్స్ హైదరాబాద్(SRH) గత ఏడాది ఊపును కొనసాగించింది. దీంతో ఇవాళ రాజస్థాన్ రాయల్స్(RR) జట్టుతో జరిగిన మ్యాచులో SRH బ్యాటర్లు వీర విహారం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్(47 బంతుల్లో 106) షాన్‌దార్ సెంచరీతో చెలరేగాడు. దీంతో రాజస్థాన్ బౌలర్లు నిట్టూర్చారు. నిర్ణీత 20 ఓవర్లలో SRH 286/6 భారీ స్కోరు సాధించింది.
This is ridiculous batting from SRH camp, they missed the trophy because of one bad game.
But this time Srh will make sure they will finish the unfinished bussines.
Travis head is so far the best cricketer in last 4 years in all formats.pic.twitter.com/3N6GhVKLOM
— Sujeet Suman (@sujeetsuman1991) March 23, 2025
వచ్చిన వారు వచ్చినట్లు బాదుడే బాదుడు..
గత ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చూసిన వారెవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. విధ్వంసానికి మారుపేరులా సన్ రైజర్స్ బ్యాట్స్ మన్లు ఊచకోత ఓశారు. అదేమీ గాలివాటం కాదని తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ హైదరాబాద్ తన ట్రేడ్ మార్కు బాదుడకు తెరలేపింది. తొలుత ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 67), అభిషేక్ (11 బంతుల్లో 24) చెలరేగగా.. హెడ్‌కు జతకలిసిన ఇషాన్ వచ్చీ రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 30), క్లాసెన్ (14 బంతుల్లో 34) రన్స్ చేశారు.
ఆర్చర్‌కు బ్యాటర్ల టార్చర్
కాగా రాజస్థాన్ బౌలర్లలో దేశ్ పాండే 3, మహేశ్ తీక్షణ 2, సందీప్ 1 వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉండగా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు సమర్పించుకొని దారుణంగా విఫలమయ్యాడు. కాగా RR గెలవాలంటే 20 ఓవర్లలో 287 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.