
పాకిస్తాన్(Pakistan)లోని బలూచ్ వేర్పాటు వాదులు తమ భూభాగంలోని ఓ ట్రైన్‌ను హైజాక్(Hijack the train) చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్(Balochistan Province)లోని వేర్పాటువాద సాయధులు ఫిబ్రవరి 11న దాదాపు 400 మంది ప్రయాణికులున్న ప్యాసింజర్ రైలు(Passenger train)పై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. లోకో ఫైలట్‌ను గాయపరిచి రైలును పూర్తిగా వారి అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా 30 పాక్ సైనిక సిబ్బంది మృత్యువాత పడగా.. సాయుధులైన బలూచ్ ఉగ్రవాదుల చేతిలో దాదాపు 214 మంది ప్రయాణికులు బందీలుగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
లేకుంటే అందరి ప్రాణాలకు ముప్పే..
పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా(Khyber Pakhtunkhwa)లోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న బలూచ్ ఆర్మీ(Baloch Army).. ట్రైన్‌పై కాల్పులకు పాల్పడినట్లు పాకిస్థాన్ రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న రైలులో పాక్ సైన్యానికి చెందిన సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సభ్యులున్నారు అనేది బలూచ్ ఆర్మీ అనుమానం. వారు స్వతహాగా తమకు లొంగిపోవాలని డిమాండ్ చేసిన బలూచ్ సైనికులు.. లేదంటే అందరి ప్రాణాలకు ముప్పే అంటూ హెచ్చరికలు చేసింది.
30 మందిని కాల్చి చంపిన బలూచ్ సైనికులు?
కాగా కొన్ని విషయాల్లో బలూచ్ ఆర్మీ చాలా క్రూరంగా పని చేస్తోంది. ముఖ్యంగా పాక్ విషయంలో మరింత ఆగ్రహంగా దాడులకు తెగబడుతోంది. ఈ తరుణంలో రైలులోని వారి గుర్తింపులు పరిశీలిస్తూ ఇప్పటికే 30 మందిని కాల్చి చంపిన బలూచ్ సైనికులు.. మిగతా వారిని ఏం చేస్తారో అన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్న నేపథ్యంలో ఇంకా బలూచ్ అధికారులు కానీ, రైల్వే నుంచి కానీ ఎలాంటి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం వెల్లడించలేదు. అయితే పాకిస్థాన్ సాయుధ దళాలు ఉగ్రవాదులపై దాడి చేసి 13 మంది చంపి 100 మంది బందీలను విడిపించినట్లు INAలు పేర్కొన్నాయి.