తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్‌గా మొదలైన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) ప్రయాణం, ప్రస్తుతం టాలెంటెడ్ నటిగా కొనసాగుతోంది. ఆమె తన హోస్టింగ్ స్టైల్, అందం, అభినయంతో టెలివిజన్ స్క్రీన్‌ను నుండి సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రత్యేకతను చాటుకుంది. అనసూయ నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ‘క్షణం’ సినిమా ఆమెకు మంచి గుర్తింపును ఇచ్చింది.

అయితే ఆమెకు అసలైన టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ‘రంగస్థలం’ (Rangastalam)సినిమా. ఇందులో రంగమ్మత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రలో ఆమె చూపిన న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనసూయ పుష్ప: ది రైజ్, ఖిలాడి, దర్బార్, వంగవీటి, దొరాసాని వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తన సత్తా చాటింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను టీవీలో యాంకర్‌గా పనిచేస్తున్న సమయంలో డేటింగ్(Dating)లో ఉన్నానని, చాలా ఓపెన్గా చెప్పింది. తన జీవితంలో ఒక్కరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నారని, ఆయనే తన భర్త సుశాంక్ భరద్వాజ్(Shushank Bharadwaj) అని చెప్పారు. తనికి మొదట తల్లి పవిత్ర పేరు పెట్టాలనుకున్నా, తండ్రి మాత్రం అమ్మమ్మ పేరైన “అనసూయ” పెట్టారని వివరించారు.

ప్రస్తుతం అనసూయ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రంలో నటించింది. అలాగే అనసూయ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అంతేకాక, సోషల్ మీడియాలో కూడా అనసూయ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచే వ్యక్తిగా గుర్తింపు పొందింది. కొన్నిసార్లు ఆమె స్పందనలు వివాదాస్పదంగా మారినా, వాటికి ధైర్యంగా స్పందించడంలో ఆమె ధైర్యాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.






