
కరోనా పుణ్యమా అని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశం వచ్చింది. అది ఇప్పటికీ చాలా కంపెనీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం చేయమంటే చాలా మంది వర్క్ ఫ్రం ట్రైన్, వర్క్ ఫ్రం బస్సులు చేస్తుంటారు. మనం ప్రయాణిస్తున్నప్పుడు వీళ్ల చేతిలో ల్యాప్ టాప్ లు ఉండటం చూస్తూనే ఉంటాం. అలా బెంగళూరు మహిళ కూడా ప్రయాణం చేస్తూ వర్క్ చేసింది. దానికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా చలాన్ వేశారు. అసలేం జరిగిందంటే..?
కారు డ్రైవ్ చేస్తూ వర్క్
బెంగళూరులోని ఆర్టీ నగర్‌లో ఓ మహిళ కారు డ్రైవ్ చేస్తూ ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసింది. దీన్ని పక్కనే వెళ్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
Women was caught by #Police playing with her laptop while driving in #Karnataka 😱
Police caught her & said ‘work from home not from car’ 😂😂#BirdFlu #ViratKohli #Rcbcaptain #WaqfAmendmentBill #KissDay #MutualFunds #PMModi pic.twitter.com/Hrh2T3qu2r— Daphi (@Dafi_syiemz) February 13, 2025
వర్క్ ఫ్రం కారు చేయకూడదమ్మా
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వీడియోతో పాటు ఫొటోను ట్రాఫిక్ డీసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) అనేది ఇంటి నుంచి చేసేది. కారు డ్రైవ్ చేస్తూ చేసేది కాదు. మీరు చేస్తోంది వర్క్ ఫ్రం కారు.’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. మరోవైపు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామెంట్లు పెడుతున్నారు.