
YCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడిని కిడ్నాప్(Kidnap) చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్(Arrest) చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. YCP నేత అరెస్ట్‌తో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనపై BNS 140(1), 308, 351, రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. వంశీ అరెస్టుతో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
YSRCP ex-MLA Vallabhaneni Vamsi arrested in #Hyderabad
Former #Gannavaram MLA and #YSRCP leader #VallabhaneniVamsi has been arrested by the #AndhraPradesh Police. He was booked under various sections, including u/s 140(1), 308, 351(3), and r/w 3(5) of BNS by Patamata Police,… pic.twitter.com/XnzHH2Ch9b
— Surya Reddy (@jsuryareddy) February 13, 2025
వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు..
తొలుత వంశీని కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.. పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం వంశీని విచారిస్తున్నారు.. అ తర్వాత వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి(Hospital)కి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ పేటలో ఉన్న SC, ST కేసుల ప్రత్యక న్యాయస్థానంలో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపర్చనున్నారు. కాగా నందిగామ దగ్గర వంశీ భార్య పంకజశ్రీ కారును కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తప్పుచేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష తప్పదంటూ TDP నేతలు కామెంట్ చేస్తున్నారు.
ప్రతిపక్షాన్ని నిందించడమే పరిపాటిగా మారింది: బొత్స
ఇదిలా ఉండగా వంశీ అరెస్టును మాజీ మంత్రి, MLC బొత్స సత్సనారాణ(Botsa Satsanarana) ఖండించారు. ప్రతిపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ YSRCPని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఫ్రీహోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. అప్పులు తేవడం, హామీల అమలు చేయకపోవడంతో పాటు, డైవర్షన్ పాలిటిక్స్(Diversion politics) చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని బొత్స విమర్శించారు.