
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వైరస్(Bird flu virus) విస్తరిస్తోంది. ముఖ్యంగా APలోని గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకడంతో వేలాది కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెడుతున్నారు. అటు అధికారులు సైతం పలు చోట్ల రెడ్ అలర్ట్(Alert) జారీ చేశారు. చికెన్(Chicken), కోడిగుడ్లు(Eggs) తినొద్దంటూ సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు(Chicken Rates) అమాతం పడిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.100 నుంచి రూ.120కు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో చికెన్ తినాలంటే ప్రజలు భయపడి పోవాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి.
కొన్ని రోజులు చికెన్, గుడ్లు తినొద్దు: అధికారులు
గోదావరి జిల్లాల్లో వైరస్‌తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో(Poultries) తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్(positive)గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 95429 08025 నెంబర్ ఏర్పాటు చేశారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారుల(For Animal Husbandry Department officials)కు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఏలూరు జిల్లా ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ
తాజాగా ఏలూరు జిల్లా(Eluru District)లో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్(The person is bird flu positive)గా తేలినట్లు రావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫాంకు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు(Medical camps) ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణ(Telangana)లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిని నిపివేశారు.