అమ్మవారికి చీర బదులు గౌను.. వివాదంలో బోడుప్పల్ నిమిషాంబికా ఆలయ పూజారి

Mana Enadu : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Navaratri Utsavalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరూ.. వాడా.. చిన్నా పెద్దా అంతా కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గామాత (Goddess Durga) వైభవంగా పూజలందుకుంటున్నారు.  నియమ నిష్ఠలతో భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. చాలా మంది ఈ నవరాత్రుల సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారు.

9 రోజుల్లో..9 రూపాల్లో అమ్మవారి దర్శనం

అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు.. 9 రోజులపాటు 9 రూపాలలో మహాశక్తి స్వరూపిణిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై శక్తి సాధించిన విజయానికి గుర్తుగా పదో రోజున ‘విజయదశమి (Dussehra)’ పండుగని జరుపుకుంటున్నాం.  ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు.. ఒక్కో అలంకారంలో.. ఒక్కో రంగు వస్త్రాలలో భక్తులకు దర్శమిస్తుంటారు. అలా హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో అమ్మవారు కొలువై వివిధ అలంకారాల్లో భక్తులను కనువిందు చేస్తున్నారు.

దుర్గమ్మకు చీరకు బదులు గౌను

అయితే నగరంలోని బోడుప్పల్ నిమిషాంబికా దేవాలయం (boduppal nimishamba temple)లో మాత్రం అమ్మవారి అలంకారణ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరీగా పూజారులు అలంకరించారు. అయితే పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం, సంప్రదాయం ప్రకారం అమ్మవారిని చీరతో అలంకరిస్తుంటారు. కానీ ఇక్కడి అమ్మవారిని మాత్రం పూజారి గౌనులో అలంకరించడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

పూజారి వివాదాస్పద వీడియో

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్గమ్మ అలంకరణ చూసి షాకయ్యారు. చీర కాకుండా గౌను (Goddess Durga Frock)లో అమ్మను అలంకరించడంతో షాకై అలా ఎందుకు చేశారని పూజారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పూజారి మహిళా భక్తులపై తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా పరుష పదజాలం ఉపయోగిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు.

 

పూజారిపై భక్తులు ఫైర్

ఈ క్రమంలోనే అమ్మవారు బాలాత్రిపుర సుందరీ అవతారంలో దర్శనమిస్తున్నారని అన్న పూజారి.. బట్టలేకుండా.. మీలా జుట్టు విరబోసుకుని లేరంటూ అసభ్య పదజాలం వాడుతూ ఓ మహిళపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూజారి తీరుపై భక్తులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *