Mana Enadu : రాధికా ఆప్టే (Radhika Apte) తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పేరే. రక్త చరిత్ర, బాలయ్యతో కలిసి లెజెండ్(Legend), లయన్ వంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైంది రాధిక. అప్పట్లో ఈ భామ టాలీవుడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వివాదంలో కూడా చిక్కుకుంది. చాలా రోజుల నుంచి ఈ బ్యూటీ తెలుగు సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. తాజాగా ఈ భామ లైమ్ లైట్ లో కనిపించిన తీరు చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు అందరూ షాక్ అయ్యారు.
తల్లి కాబోతున్న రాధికా ఆప్టే
తాజాగా బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024)కు రాధికా ఆప్టే హాజరైంది. ఈ ఈవెంట్ లో రాధిక బేబీ బంప్ తో కనిపించి అందరికీ స్వీట్ షాక్ అండ్ క్యూట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక రాధిక ప్రధాన పాత్రలో నటించిన ‘సిస్టర్ మిడ్ నైట్(Sister Mid Night)’ మూవీని లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ సినిమా స్క్రీనింగ్ కోసమే రాధికా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది.
View this post on Instagram
బేబీ బంప్ తో రాధిక
రాధిక బ్లాక్ డ్రెస్సులో బేబీ బంప్(Radhika Apte Babu Bump)తో కనిపించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు చూసే వరకు రాధిక ప్రెగ్నెంట్ అనే విషయం చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ఇక ఈ ఫొటోలు చూసి అసలు ఈమెకు పెళ్లి ఎప్పుడు అయింది అని ఇంటర్నెట్ లో వెతకడం షురూ చేశారు. రాధికా ఆప్టే భర్త(Radhika Apte Husband) మ్యూజిక్ కంపోజర్ అండ్ వయలనిస్ట్ అయిన బెనెడిక్ట్ టైలర్. 2012లో అతడితో రాధికా ఆప్టే వివాహం జరిగింది. రాధిక తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయదు. అందుకే ఈ విషయాలు ఎవరికీ తెలియవు.