Mana Enadu : సలార్, కల్కి(Kalki) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇక ఇదే కాకుండా సలార్-2, కల్కి-2, స్పిరిట్ (Spirit), ఫౌజీ చిత్రాలు కూడా డార్లింగ్ లైనప్ లో ఉన్నాయి. సీతారామం వంటి క్లాసికల్ హిట్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ చిత్ర టైటిల్ ఫౌజీగా ప్రచారంలో ఉంది.
View this post on Instagram
ఫౌజీలో సెకండ్ లీడ్ గా మలయాళీ కుట్టి
అయితే ఇటీవలే ప్రభాస్-హను (Hanu Raghavapudi) సినిమా పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీలో డార్లింగ్ కు జంటగా యూట్యూబ్ సెన్సేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్ (Imanvi Esmail) నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఇమాన్వీతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే హను రాఘవపూడి పలువురు నటీమణులు సంప్రదించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ మలయాళీ కుట్టి ఈ రోల్ కు ఫైనల్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
డార్లింగ్ కు జోడీగా నమితా
మాలీవడ్ బ్యూటీ నమితా ప్రమోద్ (Namitha Pramod) తెలుగు వారికీ సుపరిచితమే. చుట్టాలబ్బాయి, కథలో రాజకుమారి వంటి సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమాలో నమితా ప్రమోద్ సెకండ్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా (Fauji) సంగతికి వస్తే ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కూడా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడట హను.
View this post on Instagram