హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కొత్త పాలసీ

Mana Enadu : సర్కార్ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా(Hydra)’ దూకుడుగా ముందుకెళ్తోంది, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు కనిపిస్తే చాలు బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. అయితే వీటిలో సామాన్యుల భవనాలు కూడా ఉండటంతో ప్రభుత్వంపై, హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Ranganath) తోపాటు అధికారులు సమాలోచనలు చేశారు. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను రంగనాథ్ కలిసి ఈ విషయాన్ని వివరించారు.

కూల్చేస్తే రోడ్డున పడతారు

అంతే కాకుండా నగరంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వేల నిర్మాణాలు ఉన్నాయని.. చాలా సామాన్యులు ఏళ్ల తరబడి కష్టపడి డబ్బు పోగేసి ఇక్కడి ఫ్లాట్లు కొనుగోలు చేశారని రంగనాథ్ డిప్యూటీ సీఎం (Deputy CM Bhatti) దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఈ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపడితే వారంతా రోడ్డున పడతారని తెలిపారు. నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు భారీగానే ఉన్నాయని.. అందులో కొన్ని తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని భట్టి(Bhatti Vikramarka)కి రంగనాథ్ వివరించారు.

పరిహారం ఇప్పిస్తే

నిబంధనల ప్రకారం అయితే వీటిని హైడ్రా కూల్చివేయాల్సిందే(Hydra Demolitions) కానీ అలా చేస్తే ఎన్నో ఏళ్ల కింద కొనుగోలు చేసిన సామాన్యులు రోడ్డున పడతారని.. ఈ నేపథ్యంలో  ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని డిప్యూటీ సీఎంకు రంగనాథ్ తెలిపారు. అలా జరగకుండా బిల్డర్లతో బాధితులకు పరిహారం ఇప్పించేలా చూడాలని కోరారు.

హైడ్రాపై కొత్త పాలసీ

ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకువెళ్లాలని డిప్యూటీ ముఖ్యమంత్రిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం (Hydra New Polciy) తీసుకోనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. బిల్డర్‌ నుంచి కొనుగోలుదారులకు పరిహారం ఇప్పించేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. 

Share post:

లేటెస్ట్