హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam).. ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్ తాత- మనవళ్లుగా నటించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో గత నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఆహా వేదికగా మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ (Brahma Anandam OTT Release) కానుంది.
స్టోరీ ఇదే :
థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలని కలలు కంటుంటాడు. దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే ఛాన్స్ వస్తుంది బ్రహ్మకు. అయితే ఇందులో పాల్గొనాలంటే రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఓల్డేజ్ హోమ్ లో ఉన్న తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన పేరు మీద ఆరెకరాల భూమి ఉందని.. తాను చెప్పినట్లు చేస్తే అది ఇస్తానని చెబుతాడు. అలా చెప్పి బ్రహ్మను ఊరుకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? మూర్తి వృద్ధాశ్రమంలోనే ఉండిపోవడానికి కారణమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.






