వారి పేర్లు నమోదు చేయండి.. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Mana Enadu : ఆయుష్మాన్‌ భారత్​లో భాగంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 70 ఏళ్లు, ఆ పైబడిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రయోజనాలు కల్పించడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యూటీలు) కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ఇందులో  భాగంగా అర్హులైన వారి పేర్లను( Ayushman Card Enrollment) నమోదు చేయాలని, ఆసక్తి ఉన్న పౌరులందరికీ ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకంలో భాగమయ్యేలా అవకాశం కల్పించాలని కోరింది.

ఈ పథకంలో భాగమవ్వాలనుకునే 70 ఏళ్లు దాటిన పౌరులు ఆయుష్మాన్‌ మొబైల్‌ యాప్‌లోగానీ, వెబ్‌సైట్‌లోగానీ (Beneficiary.nha.gov.in) దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌ఎస్‌ చాంగ్‌సన్‌ సదరు లేఖ రాశారు. ఈ యాప్​లలో, పోర్టల్​లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. అయితే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలని స్పష్టం చేశారు.

ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. దరఖాస్తుకు ఆధార్‌ ఒక్కటే చాలని వెల్లడించింది. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ఉచిత ఆరోగ్య బీమా తీసుకోవాలనుకునే 70 ఏళ్లు దాటిన పౌరులు యాప్‌లోగానీ, పోర్టల్‌లోగానీ దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలో రాసుకొచ్చింది. అర్హులైన వారికి ప్రత్యేక కార్డులు అందజేస్తామని.. ఇందులో సామాజిక, ఆర్థిక పరిమితులేమీ ఉండవని తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *