మిథున్‌ చక్రవర్తికి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు

Mana Enadu : భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ఒకటి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ (Dada Saheb Phalke). ప్రతి ఏడాది ఈ అవార్డుకు వివిధ సినిమా రంగాలకు చెందిన వారిని ఎంపిక చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఈ పురస్కారానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఆరోజునే అవార్డు ప్రదానం

అక్టోబర్‌ 8వ తేదీన జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మిథున్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ‘‘మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినిమా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందించాలని జ్యూరీ నిర్ణయించింది.’’ అని కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) పోస్ట్‌ పెట్టారు.

డిస్కో డ్యాన్సర్ మిథున్

మిథున్ చక్రవర్తి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. I am A Disco Dancer​ సాంగ్ అనగానే అందరూ ఈజీగా గుర్తు పట్టేస్తారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచతమే. పవన్ కల్యాణ్ ‘గోపాల గోపాల (Gopala Gopala)’ సినిమాలో స్వామీజీగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏళ్ల మిథున్‌ గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

350 సినిమాలు.. 180 ఫ్లాపులు

1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్‌తో మంచి ఫేం సంపాదించుకున్న ఆయన బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్‌, కన్నడ, పంజాబీ భాషల్లో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.  ఈయన సినిమాల్లో దాదాపు 180 ఫ్లాపులు ఉన్నాయి. అందులో 133 నార్మల్ ఫ్లాపులు అయితే.. 47 డిజాస్టర్లు ఉన్నాయి. 1976లో ‘మృగాయ (Mrugaya)’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును కేంద్రం అందజేసింది.

Share post:

లేటెస్ట్