ఫ్రీగా జాబ్ గ్యారంటీ కోర్సు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Mana Enadu : యువతకు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్య శిక్షణ (Skill Training)పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇటీవల యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ (Young India Skill University)ని నెలకొల్పింది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించటమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

నైపుణ్య డిగ్రీ కోర్సులు

BFSI సెక్టార్‌లోని IT & ITES నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ పెరుగుతున్న వేళ ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని అంచనా వేసిన రాష్ట్ర సర్కార్ (Telangana Govt) డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రెగ్యులర్ డిగ్రీతో పాటు నైపుణ్య డిగ్రీ కోర్సు(BFSI Job Guarantee Course)ను అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి  (TGCHE)  బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ కన్సార్టియం (BFSI)తో ఒప్పందం కుదుర్చుకుంది.

38 కళాశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఓ మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసి రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటుగానే విద్యార్థులకు నేర్పించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజినీరింగ్ కాలేజీల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను ప్రవేశపెట్టనుంది.  ఈ అకడమిక్ ఇయర్ (2024–25) నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుది. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభించనున్నారు.
10వేల మందికి ఫ్రీ కోచింగ్
5000 మంది ఇంజినీరింగ్ (Engineering), 5000 మంది నాన్ ఇంజినీరింగ్… మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ  కోర్సు నేర్పిస్తారు. అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్ తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR Funds) నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది.  తొలి విడతగా EQUIPPP అనే సంస్థ రూ.2.50 కోట్లను అందించేందుకు సిద్ధపడింది. ప్రతి ఏడాది పది వేల మంది విద్యార్థులకు మూడేండ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ ను ఈ సంస్థ సమీకరిస్తుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *