Mana Enadu : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ సేల్‌కు రంగం సిద్ధం చేసింది. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్టివల్ సేల్ (Samsung Fab Grab Fest sale) పేరిట సేల్ నిర్వహించనుంజది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ డీల్స్ అందించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ డీల్స్ లో.. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు (Galaxy Smartphones), గెలాక్సీ బుక్, ట్యాబ్, టీవీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 53శాతం వరకు రాయితీ పొందొచ్చని వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే..
- గెలాక్సీ జెడ్ సిరీస్, ఎస్ సిరీస్, ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లపై 53శాతం వరకు డిస్కౌంట్.
- శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 (Samsung Galaxy Z Fold 6) కొన్న వారికి ఎఫ్‌ఈ ఇయర్‌బడ్స్‌పై రూ.1,249 వరకు ఆఫర్.
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్6, గెలాక్సీ ఎస్24 సిరీస్, గెలాక్సీ ఎస్23 సిరీస్, గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35, గెలాక్సీ ఎం35, గెలాక్సీ ఎం15, గెలాక్సీ ఎఫ్55 ఫోన్లు ఈ డీల్స్‌లో ఉన్నాయి.
- గెలాక్సీ బుక్4 సిరీస్‌పై 27శాతం తగ్గింపు
- గెలాక్సీ బుక్ 4 మోడల్ కొనుగోలు చేసిన వారికి హెచ్‌డీ ఫ్లాట్ మానిటర్‌పై రూ.1,920 తగ్గింపు.
- గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఎస్9 సిరీస్‌లపై గరిష్ఠంగా 74శాతం వరకు డిస్కౌంట్.
మీరు ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, వేరియబుల్స్, లాప్‌ట్యాప్‌ల(Samsung Laptop)ను ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 40శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని సంస్థ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారు శాంసంగ్ స్మార్ట్‌టీవీలపై 22.5శాతం వరకు క్యాష్‌బ్యాక్ (Cash Back) పొందొచ్చు. అందిచనుంది. ఇక ఈ డీల్స్ పొందాలంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయాలి.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…