
వినియోగదారులకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder) పై భారీ తగ్గింపు చోటుచేసుకుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41 తగ్గించింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,762 వరకు చేరింది.
వాటిలో నో తగ్గింపు
తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. దీంతో వినియోగదారులు కాస్త నిరాశ చెందారు. అయితే పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల కింద ఉచిత సిలిండర్లు (Free Cylinder) ఇస్తుండటంతో కొందరు లబ్ధిదారులకు కాస్త ఊరట లభించినట్లు అవుతోంది.
రూ.41 తగ్గింపు
ఇక వరుసగా ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు జనవరి, ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 2025 ఫిబ్రవరి 1వ తేదీన 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.7 మేర తగ్గగా.. తాజాగా రూ.41 తగ్గి రూ.1,762 వద్ద పలుకుతోంది.