కాంగ్రెస్ నేత డీఎస్ ఆరోగ్యం విష‌మం

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతోపాటు పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. డీఎస్‌కు గతంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతోపాటు పక్షవాతం కూడా సోకింది. ఆయన పరిస్థితి విశమంగా ఉందని, ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

1948, సెప్టెంబరు 27న డీ.శ్రీనివాస్‌ నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డీఎస్‌.. ఆ పార్టీలో ఉన్నత పదవులను చేపట్టారు. 1989లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకుడిగా పనిచేశారు. 2004, 2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

2004లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్‌ను ఓడించి నిజామాబాద్‌ నుంచి మూడో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో డీఎస్ ఓడిపోయారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలల్లో, 2014లో నిజామాబాద్ రూరల్‌ నుంచి పోటీచేసి వరుసగా ఓడిపోయారు. దీంతో 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. కానీ, పదవీ కాలం ముగిసే వరకు పార్టీలో కొనసాగారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు ఆయ‌న చిన్న కుమారుడు అర్వింద్ భాజ‌పా నుంచి ఎంపీగా కొన‌సాగుతుండ‌గా.. పెద్ద కుమారుడు సంజ‌య్ కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *