డేంజర్ జోన్ లో HYD ఫుడ్ ప్రియులు

హైదరాబాద్:నాణ్యతలేని ఆహారాన్ని వినియోగదారులకు సరఫరా చేయడంతో పాటుగా.. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్ పై ఈనెల 15న కొంత మంది ఫిర్యాదు చేయడంతో పాటుగా.. ట్యాంక్ బండ్ కు చెందిన జమాలుద్దీన్ అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి.. హోటల్ ను తనిఖీ చేశారు. హోటల్ లోని కొన్ని శాంపిల్స్ సేకరించారు. అలాగే ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

 

ఇక సేకరించిన శాంపిల్స్ ను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి అధికారులు హోటల్ ను తనిఖీ చేయగా.. అప్పుడు కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడంలేదని తేలింది. అదీకాక పరిశుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం వహించడంతో.. అధికారులు కొరడా ఝుళిపించారు. హోటల్ ను సీజ్ చేసింది. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి.. యాజమాన్యానికి జరిమానా విధించి, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *