హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రంగం సిద్దం అయింది. అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అయింది.11న కౌంటింగ్ చేసి పలితాలు ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.
ఈ నెల 3న EC బృందం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అదేరోజు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
అధికారులతో ఎన్నికల సన్నద్దత పై ఈ నెల 4న ఎన్నికల కమిషన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. జమలి ఎన్నికల పై కేంద్రం వాయిదా వేయడమతోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది. మరో వైపు ఓటర్లు తుది జాబితా కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.






