జైలుకెళ్లిన ముఖ్య‌మంత్రులు!

 

– అర‌ణ్య‌:

           ఏ రాష్ట్రమేగినా.. ఏ నేత‌ను చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం..? ఎటు చూసినా అంతా అవినీతి క్షుద్ర‌గ‌ణం. కార్పొరేట‌ర్ నుంచి సీఎం దాకా.. ఎవ్వ‌రూ ఇందుకు అతీతులు కాదు. ప్ర‌ధాన నేత‌లే మేత‌లైతే అనుచ‌ర‌గ‌ణం అనుస‌రించ‌కుండా ఉంటుందా..?

           అందుకే ఎవ్వ‌రూ అతీతులు కాద‌న్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో అవినీతి నేత‌లపై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది. దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రులు అరెస్ట‌యిన సంచ‌ల‌న ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. వాటిపై “మ‌న ఈనాడు” మార్క్ క‌థనం.

* ప‌న్నెండేళ్ల‌యినా ప‌గ‌బ‌ట్టిన కేసు!
జార్ఖండ్ రాష్ట ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ తండ్రి, మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన శిబూ సోరేన్ దాదాపు ప‌ది నెల‌లు జైలుశిక్ష అనుభ‌వించారు. ఆయ‌న‌ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి శ‌శినాథ్ కిడ్నాప్‌, హ‌త్య కేసులో ప‌న్నెండేళ్ల త‌ర్వాత‌ కోర్టు ఆయ‌న‌కు జీవ‌త ఖైదు విధించింది. అనారోగ్యం త‌దిత‌ర కార‌ణాలు, చ‌ట్టంలో లొసుగుల‌ను వాడుకుంటూ 9 నెల‌ల‌కే ఆయ‌న బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

* లాలూ.. జైలే అత్తారిళ్లు..!
లాలూప్ర‌సాద్ యాద‌వ్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. స‌మోసాలో ఆలూ ఉన్న‌న్ని రోజులు బిహార్‌లో లాలూ సీఎం అనే మాట అంద‌రికీ తెలిసిందే. మొన్న‌టి దాకా బిహార్ రాష్ట్రమ‌న‌గానే బందీపోట్లు, తుపాకీలే కాదు లాలూ ముఖం కూడా. జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించిన లాలూ రూ.950 కోట్ల‌ ప‌శువుల దాణా కుంభ‌కోణంలో దోషిగా తేలుతూ ఒక‌టి రెండూ కాదు ఏకంగా పాతికేళ్లుగా జైలుకు అత్తారిళ్లులా వెళ్లొస్తున్నారు.

1997లో 137 రోజులు, 1998 లో 73రోజులు బెయిల్‌పై బ‌య‌టికొచ్చి మ‌ళ్లీ 2000లో 11 రోజులు, 2012లో మూడు నెల‌లు జైలు జీవితం గ‌డిపిన ఆయ‌న‌.. మ‌ళ్లీ కొత్త గుట్టులు బ‌య‌ట‌ప‌డి కోర్టు 2018లో 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్ప‌టి నుంచి దాదాపు 8నెల‌లు జైళ్లో, 14నెల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల పేరిట ఆసుప‌త్రిలో గ‌డిపారు లాలు.

* క‌రుణానిధిపై క‌రుణ‌!
చెన్నై మ‌హాన‌గ‌రంలో ఫ్లైఓవ‌ర్ల నిర్మాణం కుంభ‌కోణంలో వంద‌ల కోట్లు మింగేశార‌న్నా అభియోగాల‌పై త‌మిళ‌నాడుకు ఐదేళ్లు సీఎంగా చేసిన‌ క‌రుణానిధి 87ఏళ్ల వ‌య‌సులో అరెస్ట‌య్యారు. దాదాపు ఐదు రోజుల పాటు జైళ్లో ఉన్న ఆయ‌నపై వ‌య‌సురీత్యా క‌రుణ చూపిన‌ అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత విడుద‌ల‌కు సాయం చేశారు. కేసు నీరుగారిపోయి త‌ర్వాత మ‌ళ్లీ శిక్ష ప‌డే అవ‌కాశం రాలేదు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి స్టాలిన్ క‌రుణానిధి కొడుకు కాగా, మొన్న స‌నాత‌న ధ‌ర్మం అంతం చేయాల‌న్నా ఉద‌య‌నిధి ఈయ‌న‌ మ‌నువ‌డే.

* య‌డ్యూర‌ప్ప‌కూ జైలు చిప్ప‌!
క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, భాజ‌పా నాయ‌కుడు య‌డ్యూర‌ప్ప మైనింగ్ స్కాంలో అరెస్ట‌యి జైలుపాల‌య్యారు. వంద‌ల కోట్ల విలువ చేసే భూముల‌ను త‌న కొడుకు, అల్లుడు, ముడుపులు అందించిన‌ ఇత‌ర పార్టీ నేత‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం, మైనింగ్, ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.200 కోట్ల గండి కొట్ట‌డం వంటి కేసుల్లో దోషిగా తేలిన ఆయ‌న‌కు 2011లో కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌ల సాయంతో బెయిల్‌పై బ‌య‌టికొచ్చిన ఆయ‌న మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠం కూర్చున్నారు.

*వీళ్లే కాదు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అప్ప‌టి యూపీ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌సింగ్‌ను ప్ర‌ధాని ఇందిరాగాంధీ జైళ్లో పెట్టించారు. ప్ర‌స్తుత దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సైతం ప‌రువున‌ష్టం కేసులో ఊచ‌లు లెక్క‌బెట్టారు. ప‌లు స్కాముల్లో ఝార్ఖండ్ మ‌రో మాజీ సీఎం మ‌ధుకోడా, పాఠ‌శాల ఉపాధ్యాయుల నియ‌మాకాల్లో అక్ర‌మాల‌తో హ‌ర్యాణా ముఖ్య‌మంత్రి ఓంప్ర‌కాశ్ చౌతాలా సైతం శిక్ష అనుభ‌వించిన జాబితాలో ఉన్నారు.

* ఇప్పుడు బాబు!
తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుది కీల‌క పాత్ర‌. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర నిర్మాణంలో, ఐటీ అభివృద్ధిలో కొంత‌మేర బాబు మార్క్ అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంది. అయితే అవినీతిలోనూ ఆయ‌న‌ది అదే మార్క్‌. తెలంగాణ ఏర్పాటుకు ముందు జ‌రిగిన అవినీతి ఎక్క‌డా క‌నిపించ‌క‌పోయినా.. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావతి నిర్మాణం, పోల‌వ‌రం, వివిధ టెండర్లు, ప్ర‌భుత్వ శాఖల్లో అక్క‌డ‌క్క‌డా చేసిన అవినీతిని, గ‌తంలో జైలుకు వెళ్లొచ్చిన ఇప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌య‌ట‌కి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగానే శ‌నివారం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్ పేరిట అరెస్టు చేయించారు.
రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి జైలులో శిక్ష అనుభ‌విస్తున్న చంద్ర‌బాబు నాయుడిని బ‌య‌టికి తెచ్చేందుకు అనుయాయులు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుండga.. ఆయ‌న్ని ఎలాగైనా రాకుండా చేయాల‌ని జ‌గ‌న్ అండ‌ర్‌గ్రౌండ్‌లో అన్ని శాఖ‌ల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. ఒక‌టి కాకుంటే ఇంకో కేస‌యినా వేసి ఆధారాల‌తో బుక్ చేయించాల‌ని, ఎంత ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేద‌ని ఈ విష‌యంలో స‌జ్జ‌ల‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన‌ట్టు సీఎంఓ వ్య‌క్తి ఒక‌రు చెప్పుకొచ్చారు.

* జ‌గ‌న్‌.. పేజీలు స‌రిపోవు!
ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, దేశంలోనే ప్ర‌స్తుతం ఉన్న అవినీతి నేత‌ల్లో మొద‌టి స్థానంలో ఉంటూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో స‌గానికి పైగా కేసుల వివ‌రాలే ఉన్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌తో పాటు ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున దోచుకున్నార‌న్నా అభియోగాల‌పై ఏళ్ల‌పాటు ఊచ‌లు లెక్క‌బెట్టారు.

– అర‌ణ్య‌

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *