రజినీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ సినిమా ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రజినీకాంత్‌తో కూలీ (Coolie),తోపాటు తన తర్వాతి మూవీల గురించి కూడా చెప్పారు.
My superhero movie with #AamirKhan will be the biggest action movie ever. It is not only a pan India movie but also it’s for whole world audience – #LokeshKanagaraj
The box office will explode with this one 💣💥 pic.twitter.com/mO1VK1ZhFl— RAJ (@AamirsDevotee) July 14, 2025
ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా..
‘కూలీ కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఇందులో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు రజనీకాంత్ యాక్షన్ ఉంటుంది. ట్రైలర్ విడుదలయ్యే వరకూ ఇందులో నటించిన హీరోల లుక్స్ రివీల్ చేసే ఉద్దేశం లేదు. ట్రలర్ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తాం. ఒక్క ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా. నాగార్జున (Nagarjuna) సర్ తన కెరీర్ లోనే ఇప్పటివరకూ నటించని క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారు. ఆయనను ఒప్పించేందుకు నాకు చాలా సమయం పట్టింది’ అనిని పేర్కొన్నారు.
వారి డేట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ సీక్వెల్స్ చేస్తా..
మూవీలో ఓ పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్‌ను అనుకున్నాని కానీ, ఆయన బిజీగా ఉండడంతో ఆ రోల్‌కు సౌబిన్ షాహిర్ను ఎంపిక చేసినట్లు చెప్పారు. కూలీ తర్వాత కార్తీతో ఖైదీ 2 చేస్తానని, ఆ తర్వాత ఆమిర్ సినిమా చేసే అవకాశం ఉందన్నారు. సూర్యతో ‘రోలెక్స్’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్ 2’, విజయ్‌తో మాస్టర్ 2, లియో 2 చేస్తానన్నారు. అయితే ఆ హీరోల డేట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు చేస్తానని తెలిపారు. కూలీ మూవీని లోకేశ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్ తదితరులు కూడా కీలక రోల్స్ పోషించారు. సినిమాను ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.
#LokeshKanagaraj: My film with #Aamirkhan is not just for Hindi , it’s a global film 😯🔥
First Atlee and now Loki both taking Indian cinema to next level 🫡🔥pic.twitter.com/brMHwHd17D
— Kolly Corner (@kollycorner) July 14, 2025






