బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం ప్రేక్షకులు ఊహించని విధంగా సింగర్ థామిని ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవంగా గత బిగ్ బాస్ సీజన్ లు మనం చూస్తే 3వ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ సీజన్ లో అన్ అఫీషియల్ పోలింగ్ లో థామిని లీస్ట్ లో ఉండటం వల్ల థామిని ఎలిమినేట్ అయ్యింది.
సింగర్ థామినిని ఈ వారం ఇద్దరు నామినేట్ చేసారు. పల్లవి ప్రశాంత్ థామిని గిన్నెలు కడిగెటప్పుడు తన ప్రవర్తన నచ్చలేదని నామినేట్ చేశాడు. అలాగే, ప్రిన్స్ తనని టార్గెట్ చేసిందని అస్తమానం నాకే వర్క్ చెప్తోందని నామినేట్ చేశాడు. ఈ రెండు కూడా చాలా సిల్లీ రీజన్స్ అనిపించాయి.
థామిని ఎక్కువ సేపు కిచెన్ లోనే ఉండిపోతుంది. ఇదే విషయంలో తను బాగా బాధపడింది. ఇక్కడ నేను అందరికీ వంటలక్క అయిపోయానని బాధపడుతూ చెప్పింది. ఇకపై వంటలు చేయనని చెప్పింది. ప్రిన్స్ తో మాట మాట పెరిగి గొడవ పెట్టుకుంది. తను చేసింది అంతా డ్రామా అని చెప్పేసరికి థామినీ నామినేషన్స్ లో క్లారిటీ లేకుండా పోయింది. దీనివల్ల తనకి ఓట్లు వేసేవారి సంఖ్య తగ్గిపోయింది.
సింగర్ గా హౌస్ లోకి 3వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. సరిగ్గా ఆటలో 3వ వారమే ఎలిమినేట్ అయిపోయింది థామిని. ఈ బిగ్ బాస్ ఫ్లాట్ ఫార్మ్ అనేది నెగిటివిటీని అందించలేదు. అలా అని పాజిటివ్ గాను ఆడియన్స్ కూడా రాలేదు.