Tollywood:సంక్రాంతి బరిలో.. గుంటూరు కారం 

హైదరాబాద్:ఈ ఏడాది సంక్రాంతికి కూడా మహేష్‌ నటించిన గుంటూరు కారం చిత్రం రానుందని మొదటి నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి రుమర్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడిగా తమన్‌ను తొలగించి మరొకరిని తీసుకోనున్నారని, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత అవన్నీ పుకార్లేనని తేలింది. ఇక నటి పూజా హెగ్డే బాలీవుడ్‌ సినిమా కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం కూడా విధితమే.

 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాదంటూ మరో వార్త నెట్టింట వైరల్‌ అయ్యింది. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోతుండడంతో సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదని, అందుకే సంక్రాంతికి సినిమా థియేటర్లలోకి రాదని వార్త ఒకటి నెట్టింట తెగ ట్రెండ్‌ అయ్యింది. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు అధికారికంగా స్పందించారు చిత్ర నిర్మాత నాగ వంశీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేశారు.

 

గుంటూరు కారం సినిమా వాయిదా పడనుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పిన సూర్యదేవర నాగవంశీ.. 200 శాతం సినిమా సంక్రాంతికే వస్తుందని తేల్చి చెప్పారు. అక్టోబర్ 20వ తేదీ నాటికి టాకీ పోర్షన్‌ షూటింగ్ పూర్తి అవుతుందని, మరో నాలుగు పాటలు మాత్రమే బ్యాలన్స్‌ ఉంటుందని, అవి పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో గుంటూరు కారం సినిమాపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లైంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా నైజాం రైట్స్‌ను నిర్మాత దిల్‌రాజు రికార్డు రేటుకు కొనుగోలు చేయడం విశేషం. ఇక దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *