Megastar | మెగాస్టార్‌తో బోయపాటి శ్రీను పాన్‌ ఇండియా సినిమా?

హైదరాబాద్​:  Megastar మెగస్టార్​ చిరు ప్రస్తుతం బింబిసార మూవీ డైరక్టర్​ వశిష్ఠతో కలిసి సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నాడు. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు వచ్చాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు.

మెగాస్టార్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక దీనితో పాటు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాడు. అయితే ముందుగా దేన్ని పట్టాలెక్కిస్తాడో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక తాజాగా చిరు కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. చిరు తన నెక్స్ట్‌ సినిమాను బోయపాటితో చేయబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బోయపాటి చిరుకు ఓ లైన్‌ చెప్పాడట. అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి తీసుకురమ్మన్నాడట. ఇక చిరుకు ఫైనల్‌ నెరేషన్‌ నచ్చితే ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్‌ ఉందట. అంతేకాకుండా ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలని బోయ ప్లాన్‌ చేస్తున్నాడట. ఇందులో నిజమెతుందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఇక రీసెంట్‌గా బోయపాటి తీసిని స్కంద ఫ్లాప్‌ వెంచర్‌గా మిగిలింది. సోమవారం వరకు పర్వాలేదనిపించే కలెక్షన్‌లు వచ్చాయి కానీ.. మంగళవారం ఫుల్ డ్రాప్స్‌ పడే చాన్స్ ఉందని తెలుస్తుంది. స్కంద రిజల్ట్‌ చూసాక కూడా చిరు.. బోయపాటితో సినిమా చేస్తాడా అంటే.. డౌట్‌ అనే చెప్పాలి. అయితే తెలుగులో హిట్టే లేని మెహర్‌ రమేష్‌కు చాన్స్‌ ఇచ్చినప్పుడు.. కెరీర్‌లో బంపర్‌ హిట్లున్న బోయపాటికి చాన్స్‌ ఇవ్వడా అంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

వాలెంటైన్స్ డే స్పెషల్.. ప్రేమకు తెలుగు సినిమా నిర్వచనం

ప్రేమ (Love).. ఈ రెండక్షరాల ఎమోషన్ ప్రతి మనిషి జీవితంలో ఓ అందమైన మధురానుభూతి. ప్రేమకు ఎన్నో అర్థాలున్నాయి. ప్రేమ అంటే ఏంటి అంటే దానికి సరైన డెఫినేషన్ లేదు. మనుషుల మనసును బట్టి ప్రేమకు అర్థం మారిపోతుంది. కొందరు తమకిష్టమైన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *