Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో నేడు 5వ వారం ఎలిమినేషన్ జరగబోతుంది. దీంతో ప్రేక్షకులతోపాటు కంటెస్టెంట్లలో ఉత్కంఠగా ఉంది. ఉల్టా,ఫల్టా అని ముందు నుంచే నాగర్జున ఇంటి సభ్యలకు చెప్తూనే, ఆటపై దృష్టి సారించాలని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ లేదా ఒకరిని సిక్రెట్ రూమ్‌కి పంపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో మొదటి కెప్టెన్ ప్రశాంత్‌పై నాగర్జున ప్రశంసలు వర్షం కురిపించాడడు.సందీప్, అమర్ దీప్‌లకు సీరియస్‌గానే క్లాస్ పీకాడు. ఆ తర్వాత కొద్దిసేపు సరదాగా సాగింది. ఇక చివరిలో ఎలిమినేషన్ గురించి ప్రస్తవించారు.
హౌస్‌లో ఉండేందుకు అనర్హులు ఎవరో డిసైడ్ చేయాలంటూ వారికే టాస్క్ ఇచ్చాడు. ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురిలో ముగ్గురిని సెలెక్ట్ చేయాలనే కండీషన్ పెట్టాడు. హౌస్ మేట్స్ ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా తేల్చారు. ఇంతలో నాగర్జున ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం అనర్హులు ఎవరనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కాగా, నేడు డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఎలిమినేట్ చేసి, వీరిలో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది.
14 మందితో మొదలైన బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్.. ప్రస్తుతం 10 మంది మాత్రమే మిగిలారు. గత నాలుగు వారాలుగా అమ్మాయిలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వారిలో కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిని, రతిక ఉన్నారు. గత సోమవారం శోభా, సందీప్, ప్రశాంత్ మినహా మిగిలిన ఏడుగురు నామినేట్ అయ్యారు. అయితే శివాజీ ఓటింగ్‌లో దూకుడు చూపించాడు. ఆ తర్వాత స్థానంలో యావర్, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ ఉన్నారు. కాగా చివరి స్థానాల్లో శుభ శ్రీ, ప్రియాంక, టేస్టీ తేజ నిలిచారు. అయితే, అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌తో టేస్టీ తేజ టాప్‌లోకి దూసుకొచ్చాడు. దీంతో ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు.
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…