నేరుగా ఓటీటీ వేదిక ద్వారా విడుదలయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువ. పెద్ద నిర్మాణ సంస్థలన్నీ ఓటీటీ వేదికగా నుంచే సినిమాలను విడుదల చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమయింది. అనసూయ గెస్ట్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ప్రేమ విమానం. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అక్టోబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రేమ విమానం ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని పల్లెటూరు నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 2.24 నిమిషాల నిడివి ఉన్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్ పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకుంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను ఈ సినిమాలో అందంగా చూపించినట్లు స్పష్టమవుతోంది. సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ నిర్మించింది.
అక్టోబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రేమ విమానం ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని పల్లెటూరు నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 2.24 నిమిషాల నిడివి ఉన్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్ పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకుంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను ఈ సినిమాలో అందంగా చూపించినట్లు తెలుస్తుంది.
అమ్మాయి, పేదింట్లో అబ్బాయి మధ్య ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తుంది. అదే విధంగా ఇద్దరి ప్రేమ కథ చివరికి ఏమైందన్న అంశాలను సినిమాలో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనసూయ గెస్ట్ రోల్‌లో మరోసారి అదరగొట్టింది. పూర్తిగా డీగ్లామర్ రోల్‌లో మరోసారి సహజ నటనతో ఆకట్టుకుంది.