Janvi Kapoor: వావ్..లంగా ఓణీలో.. అచ్చం శ్రీదేవీని చూసినట్లే ఉంది.!

 

లంగా ఓణీలో.. అచ్చమైన తెలుగు అమ్మాయిగా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర చిత్రంలోని ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సేమ్ శ్రీదేవీని చూసిన ఫీలింగే కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

లంగా ఓణీ.. అచ్చమైన తెలుగు పిల్లలా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర సినిమా కు సబంధించిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాల నటి శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. హిందీలో కొన్ని మూవీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

జాన్వీ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ధడక్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం గుంజన్ సక్సేనా చిత్రంలో నటించింది. ఆ తర్వాత రూహీ, మిలి, బవాల్ లాంటి సినిమాల్లో నటించినా ఫలితం దక్కలేదు. దాంతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. తాజాగా, జాన్వీ కపూర్ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా కనిపిస్తున్న లేటెస్ట్ స్టిల్ ను దేవర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. లేలేత పరువాల జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. మెడలో చిన్న తాయత్తు లాంటింది ధరించి ఆకట్టుకొంటున్నారు. సాదాసీదా గ్రామీణ అమ్మాయిగా చూడగానే ముచ్చటేసేలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతున్నది. శ్రీదేవీ చూసిన ఫీలింగ్ కలుగుతున్నదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర పేరు ‘తంగం’. “ఇదిగో మా తంగం” అంటూ చిత్రబృందం పోస్ట్ చేసింది. దేవర చిత్రం తాజాగా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ కోసం ఇటీవల గోవా వెళ్లాడు.ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

 

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *