Movies:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత

Movies:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత

ఇటలీలోని టస్కనీలో మెగా ఫ్యామిలీ పెళ్ళి సందడి మొదలైంది. వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకలతో హడావుడిగా ఉంది. మొదట కాక్ టెయిల్ పార్టీ ఇచ్చిన వరుణ్-లావణ్య జంట.. తరువాత బార్గో సాన్ ఫెలిసే రిసార్ట్‌లో హల్దీ వేడుకలతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. ఇక వీళ్ళ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొంతమంది వెళ్ళనున్నారని సమాచారం. వీరిలో నాగచైతన్య-సమంత కూడా ఉన్నారు. విడిపోయిన తర్వాత వీరు ఇలా ఒక ఫంక్షన్ లో కలవడం ఇదే మొదటిసారి అంటున్నారు.

హీరో నితిన్, షాలిని దంపతులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. నితిన్ ఫోటో ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చింది. అయితే, వాళ్లతో పాటు అక్కినేని నాగచైతన్య, సమంత కూడా పాల్గొంటారని సమాచారం. నాగచైతన్య ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. ఇక సమంత నిన్న ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంట పడ్డారు.

ఇక ఇటలీలో పెళ్ళి వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. పెళ్ళికి ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, ఇతర మెగా అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. అలాగే సంగీత్ కార్యక్రమంలో కొణిదెల ఫ్యామిలీ డాన్సులతో సందడి చేసింది. ఒక ఈ రోజు మధ్యాహ్నం వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది. మధ్యాహ్నం 2.48 గంటలకు ముహూర్తం. రాత్రి 8.30 నుంచి రిసెప్షన్ ఉంటుంది.

ఈ పెళ్లి వేడుకలో మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అతిథులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే హీరో నితిన్, ఆయన భార్య షాలిని ఇటలీ చేరుకున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య, సమంత, రష్మిక మందన కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొననున్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ నుంచి ఇప్పటికే బయలుదేరి వెళ్లారని సమాచారం. నాగచైతన్య, సమంత విడిపోయిన తరవాత ఒక ఫంక్షన్‌లో ఎదురెదురు పడుతుండడం ఇదే తొలిసారి. దీంతో అందరిలో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు బయటకు వస్తాయా లేదో చూడాలి అంటున్నారు. నాగచైతన్య, సమంత ఎదురెదురు పడితే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

Related Posts

ఆ అద్భుతాన్ని అవతార్-3లో చూస్తారు : జేమ్స్‌ కామెరూన్‌

‘‘సినిమా లవర్స్ అంచనాలకు మించి అవతార్-3 (Avatar-3) సినిమా ఉంటుంది. ఈసారి మేం అందించబోయే విజువల్ వండర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గత రెండు సినిమాల్లో చూసినవి రిపీట్ కాకుండా మూడో పార్ట్ తెరకెక్కిస్తున్నాం. కొన్ని అడ్వెంచర్స్ తో మీ ముందుకు…

అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *