Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్స్.. సీరియస్ అయిన శివాజీ

హౌస్ లో ఒకొక్కరు అనర్హులు అనుకునే ఇద్దరినీ నామినేట్ చేయాలని చెప్పాడు అనర్హులు అని భావించే వారిని డ్రాగన్ స్నేక్ ముందు ఉంచాలని చెప్పాడు. దాంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ముందుగా ప్రశాంత్ తో మొదలు పెట్టారు. ఫస్ట్ అమర్‌దీప్‌ని నామినేట్ చేశాడు ప్రశాంత్. కెప్టెన్సీ రేసు నుంచి నన్ను తప్పించినప్పుడు చెప్పిన కారణం నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు ప్రశాంత్. పండించినోడివి పంచుకోవడం తెలియాలని అన్నావ్ .. అది నాకు నచ్చలేదు అన్న.. ఓడిపోయిన నీకే అంతుంటే.. నాకెంత ఉండాలి అని ప్రశాంత్ అన్నాడు.

దానికి అమర్ దీప్ సీరియస్ అయ్యాడు. ఈరోజు నువ్వు ఎక్కిస్తున్నావ్.. నీకు ఇది తిరిగి రాకపోదు.. ఆ రోజు నువ్వు రా మాట్లాడుకుందాం.. ఎన్నేసినా సరే నేను ఇక్కడున్నంత వరకు అయినోడిని మళ్లీ కెప్టెన్ కానీయను..అంటూ డైలాగ్ కొట్టాడు. ఆతర్వాత తేజకు నామినేట్ చేశాడు. కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించిందుకు తేజను నామినేట్ చేశాడు ప్రశాంత్.

ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్‌లో వచ్చావ్.. ఒక బాంబ్ లా ఆడుతావ్ అనుకున్నా.. కానీ అది లేదు. అంచనాలు అందుకోలేకపోయావ్.. వచ్చిన దగ్గర నుంచి ఒక్క దగ్గరే ఉండిపోయావ్.  నా క్లారిటీ నాకు ఉంది.. అంటూ రతిక అంటే నేను ఏంటో చూపిస్తా అన్నావ్ కదా.. లాస్ట్ వీక్ చూపించలేకపోయావ్ .? అని ప్రియాంక ప్రశ్నించిది. దానికి రతికా ఎదో చెప్పింది. ఆతర్వాత భోలే ని నామినేట్ చేసింది. వెంటనే మనోడు తన యాటిట్యూడ్ చూపిస్తూ యస్ ప్రియాంక అంటూ లేచి నిలబడి.. ర్యాగింగ్ చేశాడు. దీంతో మీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు.. అన్యు సీరియస్ అయ్యింది ప్రియాంక. ఆతర్వాత అర్జున్ శోభను నామినేట్ చేశాడు.

అలాగే అమర్ ను నామినేట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన శివాజీ అమర్ ను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య గట్టిగానే వాడినా జరిగింది. ఆతర్వాత తేజను నామినేట్ చేశాడు శివాజీ. ఆతర్వాత రతికా తనను నామినేట్ చేసిన ప్రియాంకాను నామినేట్ చేసింది. ఆతర్వాత శోభను నామినేట్ చేసింది. తేజ అర్జున్ ను నామినేట్ చేశాడు. రతికని నామినేట్ చేశాడు తేజ. కాన భోలే ప్రియాంకాను నామినేట్ చేశాడు. ఆతర్వాత అమర్ ను నామినేట్ చేశాడు భోలే.

Related Posts

Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ‘డాకు మ‌హారాజ్‌(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు మంచి ఎమోష‌న్(Emotions) కూడా ఉండ‌డంతో తొలి ఆట…

Pushpa-2 TheRule: తగ్గిన ‘పుష్ప2’ టికెట్ రేట్లు.. రేపటి నుంచి రీలోడెడ్ వెర్షన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *