
గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal), డ్యాన్సర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మ (dhanashree Verma) విడాకుల వార్తలు చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. ఇక ఇటీవలే ఈ జంట కోర్టుకు హాజరవ్వగా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. విడిపోయేందుకు పరస్పర అంగీకారం తెలపడంతో ధనశ్రీ-చాహల్ కు జడ్జి విడాకులు మంజూరు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
View this post on Instagram
ఏం జరుగుతోంది భయ్యా
ఇక విడాకుల (Chahal Dhanashree Divorce) పుకార్లు నెట్టింట రచ్చ చేస్తున్న వేళ ధనశ్రీ, చాహల్ పెట్టిన పోస్టులు కూడా ఈ ఇద్దరు విడిపోతున్నారనే రూమర్స్ కు బలం చేకూర్చాయి. మరోవైపు దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌విశ్ (RJ Mahvash)తో కలిసి కనిపించడంతో విడాకులకు ఆమే కారణమంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీ వర్మ చేసిన ఓ పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలేం జరుగుతోంది భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
ధనశ్రీ వర్మ షాకింగ్ పోస్టు
ఓవైపు నెట్టింట చాహల్-మహవిశ్ (Chahal RJ Mahvash Dating) డేటింగ్ రూమర్స్ బాగా ట్రెండ్ అవుతున్న వేళ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ధనశ్రీవర్మ ‘మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే’ అంటూ ఓ పోస్టు పెట్టింది. అంతే కాకుండా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంతకు ముందు డిలీట్ చేసిన చాహల్ తో కలిసి ఉన్న ఫొటోలను రీస్టోరీ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అసలు ఈ జంట విడాకులు తీసుకుందా లేదా ఏం అర్థం కావడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.