
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh) ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎఫ్-2, ఎఫ్-3 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి-వెంకీ కాంబో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టింది. ఈ దగ్గుబాటి హీరో కెరీర్ లోనే ఎన్నడూ లేనంతగా ఈ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత వెంకీ మామ నెక్స్ట్ ఎలాంటి సినిమాలో నటిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
20 కథలకు నో చెప్పిన వెంకీ
అయితే వెంకీ (Venkatesh Upcoming Movie) ఎప్పుడు ఫ్యామిలీ, కామెడీ జానర్ లో సినిమా తీసినా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. అందుకే ఆయన తన తదుపరి చిత్రం కూడా ఈ జానర్ లోనే తీస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ తో రావాలని ప్లాన్ చేస్తున్నారట. గత రెండు నెలల్లో దాదాపు 20కి పైగా కథలు విని నో చెప్పారట. అయితే ఈ నేపథ్యంలో వెంకటేష్ నెక్స్ట్ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ హీరో వివి వినాయక్ (VV Vinayak) లేదా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట.
ఇద్దరు డైరెక్టర్లకు వెంకీ లైన్ క్లియర్
వెంకటేష్-వివి వినాయక్ గతంలో లక్ష్మి (Laxmi Movie) సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా లక్ష్మి-2 వస్తుందని టాక్. ఇక సురేందర్ రెడ్డి (Surendar Reddy) కిక్-2 (Kick 2), ఏజెంట్ చిత్రాలతో డిజాస్టర్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారట. కానీ ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ చిత్రాన్ని వెంకీతో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇద్దరు దర్శకులు గతంలో సూపర్ హిట్ చిత్రాలు అందించిన వాళ్లే. వీళ్ల క్యాలిబర్ పై ఎలాంటి డౌటు లేదు.
అది కరెక్టేనా వెంకీమామ
కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లు ఫామ్ లో లేరు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఈ ఇద్దరు పక్కా హిట్ ఇవ్వగలిగే సినిమా తీయగలరనే నమ్మకం ప్రేక్షకుల్లో లేదు. అందుకే వీళ్లకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని టాక్. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇద్దరు సీనియర్ దర్శకులతో వెంకటేష్ సినిమా చేయాలనుకోవడం పెద్ద సాహసమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. వాళ్లను నమ్మి మూవీ చేయడం కరెక్టేనా వెంకీమామ అని నెటిజన్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…