Lovely : వెండితెరపైకి మరోసారి ‘ఈగ’.. రీరిలీజ్ మాత్రం కాదు

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందే. అయితే సినిమాలో హీరో కేవలం 10 నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై చూపించి.. ఆ తర్వాత చిత్రమంతా ఈగతో నడిపి సూపర్ హిట్ కొట్టడం కేవలం జక్కన్నకే చెల్లింది. నేచురల్ స్టార్ నాని (Nani), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కాంబోలో కిచ్చా సుదీప్ విలన్ గా నటించిన సినిమా ఈగ. ఈ చిత్రం టాలీవుడ్ లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

లవ్లీ టీజర్ చూశారా?

అయితే తాజాగా మరోసారి ఈగ (Eega Movie) వెండితెరపై సందడి చేయబోతోంది. రీ రిలీజ్ అనుకుంటున్నారేమో కాదండోయ్. ఈగ మూవీ తరహాలో కోలీవుడ్ లో ఓ చిత్రం రాబోతోంది.  మాథివ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ‘లవ్లీ (Lovely)’ అనే చిత్రంలో ఈగ చుట్టూనే కథ తిరుగుతుందట. ఏప్రిల్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈగ-హీరో ఫ్రెండ్షిప్

తాజాగా ఈ చిత్రం టీజర్ (Lovely Teaser) రిలీజ్ అయింది. ఈ టీజర్ లో హీరోకు ఈగకు మధ్య ఫ్రెండ్షిప్ చూడొచ్చు. ఈగతో దోస్తీ చేసిన హీరో దానిని ఓ ఫ్రెండ్ లా భావిస్తూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. హీరోకు ఏదైనా సమస్య వస్తే ఈగ సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇబ్బందుల్లో పడినా ఆదుకుంటుంది. అలా ఈ టీజర్ అంతా హీరో-ఈగకు మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. ఈ మరి ఈ కథలో హీరో ఎవరు..? విలన్ ఎవరు..? హీరోయిన్ సంగతేంటి..? అనేది తెలియాలంటి ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *