
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vickey Kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava). విడుదలైన రోజు నుంచి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఈ మూవీ పలు రికార్డులు సృష్టించగా తాజాగా తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఛావా మూవీ ఇండస్ట్రీ హిట్ అయిన ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించింది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి 2 (Bahubali 2)’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో గుర్తింపు తెచ్చింది. హిందీలో ఈ సినిమా రూ.510 కోట్లు కలెక్షన్స్ సంపాదించింది. అయితే తాజాగా రిలీజ్ అయిన విక్కీ కౌశల్ ఛావా సినిమా బాహుబలి-2 హిందీ కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా బాలీవుడ్ లో ఇప్పటివరకు రూ.516 కోట్లు వసూళ్లు చేసింది. 25 రోజుల్లోనే బాలీవుడ్‌లో ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి ఛావా రికార్డు (Chhaava Record) క్రియేట్ చేసింది.
ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఛావా సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా (Akshay Khanna) కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించి తమ పర్ఫామెన్స్ తో అందరినీ మెప్పించారు. ఇక తాజాగా ఛావా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…