
తెలంగాణలో గద్దర్(Gaddar)గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు(Gummadi Vitthal Rao). కవిగా, గాయకుడిగా, విప్లవ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమనేతగా తనదైన ముద్ర వేశారు. అసమానతల సమాజంలో గద్దర్ తన జననం నుంచి మరణం వరకు అసామాన్య పోరాటం సాగించారు. తెలంగాణ మలిదశ ఉద్యమం(Telangana Movement)లో ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అంటూ యువతలో తిరుగుబాటును నేర్పడం గద్దర్‌కే చెల్లింది. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. ఆయన పేరిట గద్దర్ అవార్డు(Gaddar Awards)లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏప్రిల్‌లో అందజేస్తాం: భట్టివిక్రమార్క
గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లో గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్(Notification For Gaddar Awards) విడుదల చేస్తామని వెల్లడించింది. ఏప్రిల్‌లో గద్దర్ అవార్డులను కళాకారులకు అందజేస్తామని ప్రకటించింది. కళాకారులను, వాగ్దేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) తెలిపారు.
ఎవరెవరికి అవకాశం కల్పిస్తారో..
తెలుగు చలనచిత్ర పురస్కారాలకు సంబంధించిన విధివిధానాలను CM రేవంత్ పరిశీలించి, ఆమోదం తెలిపారు. త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(FDC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని FDC ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) పేర్కొన్నారు. కాగా తొలుత ఈ అవార్డులను ఉగాది రోజున ప్రదానం చేసేందుకు నిర్ణయించినప్పటికీ ఎంపిక ప్రక్రియ, ఆమోదానికి ఎక్కువ సమయమే పట్టనుండటంతో వాయిదా పడింది. తాజా ప్రకటనతో మళ్లీ ఈ అవార్డులపై ఆసక్తి నెలకొంది. ఏఏ రంగాలు వారికి అవకాశం కల్పిస్తుందనేది త్వరలోనే తేలనుంది.