
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప (Kannappa)’. మోహన్ బాబు, మోహన్ లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 25ల తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది.
సోలోగా విష్ణు ప్రమోషన్స్
గత కొన్ని రోజులుగా మంచు విష్ణు సోలోగా ప్రమోషన్స్ (Kannappa Promotions) చేస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కన్నప్ప విశేషాలు పంచుకున్నారు. మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు పెద్ద ఈవెంట్లు ఏం జరగలేదు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (Kannappa Pre Release Event) నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. శ్రీకాళహస్తిలో ఈ వేడుక జరగనున్నట్లు తెలిసింది. అయితే ఈ వేడుకకు ఎవరెవరు వస్తారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీరే
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ చిత్రంలో నటిస్తున్న అగ్ర తారలంతా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వస్తారా లేదా అన్నదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా తన ఆరోగ్యంపై ప్రస్తుతం ఫోకస్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా నటించాడు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటాడా లేడా అన్నది తెలియాల్సి ఉంది.
కన్నప్ప వేడుకకు ప్రభాస్
ఒకవేళ ప్రభాస్ కనుక ఈ ఈవెంట్ కు అటెండ్ అయితే కన్నప్ప సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఇటీవల రిలీజ్ చేసిన సెకండ్ టీజర్ (Kannappa Teaser) లో చివరి 5 సెకన్లు జస్ట్ అలా ముఖం చూపించి వెళ్లినందుకే ప్రభాస్ పాత్రపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ టీజర్ రిలీజ్ అయిన రోజంతా సోషల్ మీడియాలో ప్రభాస్ కనిపించిన ఆ ఐదు క్షణాల గురించే చర్చ నడిచింది. ఇక ఇప్పుడు కనుక ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే మంచు విష్ణు ఈ సినిమా విషయంలో కాస్త గట్టెక్కినట్లేనని నెటిజన్లు భావిస్తున్నారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…