యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిందని మీకు తెలుసా? ఇదిగో ఇదే ఆ సినిమా..

తెలుగు సినీ ఇండుస్త్రీలో ఒక యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది సుమ కనకాల(Suma Kanakala). యాంకరింగ్ ప్రపంచంలో ఆమె సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంటూ, టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా.. ఆమె స్థానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సుమ మొదట హీరోయిన్‌గా సినీ రంగంలో అడుగుపెట్టింది. మలయాళ అమ్మాయి అయిన సుమ, 1996లో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, వక్కంతం వంశీ హీరోగా నటించారు. సాయి శ్రీమల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ మల్లేషం ఈ చిత్రాన్ని నిర్మించగా, సంగీతాన్ని కోటీ అందించారు.

ఆ చిత్రం ఘోర అపజయాన్నిమూటగట్టుకోవడంతో పాటు తెలుగులో హీరోయిన్‌గా సుమకి గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ఆమె నటనపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. మలయాళ ఇండస్ట్రీలో ‘న్యూస్‌పేపర్ బాయ్’, ‘ఇష్టదనమ్’, ‘ఓరు విల్యుమ్ కతోర్థు’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అవి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

తర్వాత సుమ టాలీవుడ్‌కి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు. పవిత్ర ప్రేమ, చాలా బాగుంది, పండంటి సంసారం, కలిసి నడుద్దాం, రాఘవ, వర్షం, స్వరాభిషేకం, ప్రేమికులు, ఢీ, బాద్షా వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ ఆమెకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. చివరికి సుమ యాంకరింగ్ వైపు దృష్టి మళ్లించారు. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో తానే ఓ బ్రాండ్ అయిపోయింది. ఆమె ఎనర్జీ, హ్యూమర్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. సినిమాల ఆడియో ఫంక్షన్లు, ప్రమోషన్ ఈవెంట్లు, టీవీ గేమ్ షోలు – ఏ ఫార్మాట్ అయినా సుమనే ముందుంటుంది.

 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *