నేను సేఫ్.. నన్నెవరూ ఆపలేరు : డొనాల్డ్ ట్రంప్

ManaEnadu:రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్డొ డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​పై మరోసారి హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ సాయుధుడు గోల్ఫో కోర్టువైపు తుపాకీ ఎక్కుపెట్టగా సీక్రెట్ ఏజెంట్లు పట్టుకున్నారు. దీంతో ట్రంప్​నకు మరో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఈ ఘటనపై తన అభిమానులను ఉద్దేశించి ట్రంప్ ఈ-మెయిల్‌ ద్వారా ఓ సందేశం ఇచ్చారు.

డోంట్ వర్రీ నేను సేఫ్

‘‘నా సమీపంలోనే గన్ ఫైరింగ్ (Gun Firing జరిగింది. పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి. ఎవరూ కంగారు పడొద్దు. మీ అందరికి నేను ఓ విషయం గట్టిగా చెప్పదల్చుకున్నాను. నేను బాగున్నాను. సేఫ్​గా ఉన్నాను. నన్ను ఏదీ అడ్డుకోలేదు. ఎవరూ ఆపలేరు. నేను ఎప్పటికీ దేనికీ లొంగను.” అని ట్రంప్ తన ఈ-మెయిల్​లో రాసుకొచ్చారు. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్‌, ‘ఎక్స్‌’ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందిస్తూ ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris)ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’’ అంటూ సందేహం వ్యక్తంచేస్తున్న ఎమోజీని జత చేశారు. 

ట్రంప్​ భద్రతకు బైడెన్ ఆదేశాలు

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందిస్తూ.. ట్రంప్‌ సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని, ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటించారు. ట్రంప్‌నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించానని వెల్లడించారు.

ట్రంప్​ను చంపాలనే వచ్చాడు : ఎఫ్​బీఐ

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (FBI)ట్రంప్‌ను టార్గెట్ చేసుకున్న దుండగుడు ఏకే 47 మోడల్‌ వంటి తుపాకీతో సంచరించినట్లు తెలిపింది. ట్రంప్​ను చంపాలనే ఉద్దేశంతోనే అతడు వచ్చినట్లు గుర్తించామని పేర్కొంది. నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ డొనాల్డ్ ట్రంప్‌నకు 400 నుంచి 500 గజాల దూరంలోనే తన ఆయుధంతో సిద్ధమవుతుండగా భద్రతా ఏజెంట్లు షూట్ చేసి అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.

Share post:

లేటెస్ట్