Mana Enadu : చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ (Coffee), టీ (Tea) కడుపులో పడకపోతే ఏం పాలుపోదు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగితే గానీ శరీరం యాక్టివ్ మోడ్ లోకి రాదు. అయితే కాఫీపై చాలా అధ్యయనాలు రకరకాల అభిప్రాయాలు వెల్లడించాయి.
కాఫీ తాగడం మంచిదా కాదా?
కాఫీ తాగడం మంచిదని కొన్ని రీసెర్చులు చెబుతుంటే.. కాఫీ గుండెకు చాలా చేటు చేస్తుందని ఇంకొని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే కాఫీ తాగడం వల్ల శారీరకంగా యాక్టివ్ గా ఉండటమే గాక.. మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందని 2019లో “NPJ Psychological Sciences” జర్నల్‌లో ప్రచురించిన నివేదిక వెల్లడించింది. అయితే అతిగా తాగడం వల్ల అనర్థాలు ఉన్నాయని హెచ్చరించారు. మరి అవేంటంటే..
కాఫీ తాగడం వల్ల కలిగే అనర్థాలు ఇవే..
కాఫీ అధికంగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ (Dehydration)కు గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీని మితంగా తాగడం మంచిది.
కాఫీలో ఉండే కెఫీన్ అనే పదార్థం వల్ల ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీస్తుంది.
కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది. అందుకే హైబీపీ (High BP) బాధితులు కాఫీ తాగకపోవడమే నయమంటున్నారు.
సాయంత్రం తాగుతున్నారా?
రోజులో కాఫీ ఒకటి లేదా రెండు సార్లకు మించకుండా తాగాలని నిపుణలు సూచిస్తున్నారు. సాయంత్రం వేళ కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రపోయే సమయంతోపాటు నిద్ర క్వాలిటీ (Sleep Quality) కూడా తగ్గుతుందని 2018లో “స్లీప్ మెడిసిన్”లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అందుకే.. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు.








