Mana Enadu: థైరాయిడ్(Thyroid).. ప్రస్తుత కాలంలో ఈ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ఇది ఒక సాధారణ ఎండోక్రైన్ రుగ్మత(Endocrine disorder). థైరాయిడ్ గ్రంథి మెడలో ఉంటుంది. జీవక్రియ పెరుగుదల, దాని అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి(Produce hormones) చేస్తుంది. థైరాయిడ్ వ్యాధి వల్ల అలసట(tiredness), బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, పొడి చర్మం, మానసిక స్థితి మార్పులతో సహా అనేక సమస్యలు ఏర్పడుతాయి. మారుతున్న జీవనశైలి, క్రమ రహిత ఆహారపు అలవాట్లు(Eating habits), ఒత్తిడి.. థైరాయిడ్ ప్రధాన కారణాలు. ఈ పరిస్థితి శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది.
అయితే దీని దీని చికిత్సకు అనేక రకాల మందులు(Medicines) అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది సహజమైన హోం రెమెడీస్(Home remedies) ఇష్టపడతుంటారు. ఎందుకంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్(No Side effects) ఉండవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మంచి ప్రయోజనాలను అందిస్తాయి. మీరు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ, మందులకు దూరంగా ఉంటే, కొన్ని ఆకుల రసాన్ని తాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.
పుదీనా ఆకుల రసం
పుదీనా కూడా థైరాయిడ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడే శక్తివంతమైన ఔషధ మొక్క. పుదీనా ఆకుల రసం(Mint leaves juice) జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకుల రసం
తులసి ఆకు(Tulsi leaves)ల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి థైరాయిడ్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం, గ్లాస్ నీటిలో తాజా తులసి ఆకుల రసం తీసి అందులోనే ఒక చెంచా తేనెను వేసి కలిపి త్రాగాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ల(Thyroid hormones) ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
గిలోయ్ ఆకుల రసం
గిలోయ్ ఒక సహజ రోగనిరోధక బూస్టర్ దీనిలోని ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. గిలోయ్ ఆకుల రసాన్ని(Giloy leaves juice) తాగడం వల్ల థైరాయిడ్ తగ్గుతుంది. దీని కోసం, తాజా గిలోయ్ ఆకుల రసాన్ని తీసుకుని ఒక గ్లాస్(One Glass Water) నీటిలో కలపాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక చెంచా తేనె(Honey) కలిపి త్రాగాలి.
అశ్వగంధ ఆకుల రసం
అశ్వగంధ ఒక ఆయుర్వేద మూలిక. ఇది శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది. అశ్వగంధ ఆకుల రసాన్ని(Ashwagandha leaves juice) తాగడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ ప్రధాన కారణాలలో ఒకటైన ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు శారీరక శక్తి(physical strength) పెరుగుతుంది.
పైన చెప్పిన వాటిని తరుచుగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి మందులు వాడకుండా థైరాయిడ్ తగ్గడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోని వాడాలి.