దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆదివారం మినహా మిగతా రోజులు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తూనే ఉన్నారు. అయితే విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీపికబురు చెప్పాయి. 

తెలంగాణలో 2వ తేదీ నుంచి సెలవులు

ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దసరా పండగ (Dussehra Festival) నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవుల (Dussehra Holidays)ను డిక్లేర్​ చేసింది. అక్టోబర్ 2వ తేదీ (బుధవారం) నుంచి 14వ తేదీ (సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanthi)తో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ, దసరా సెలవులు ఉన్నాయి. జూనియర్​ కాలేజీలకు అక్టోబర్​ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర సర్కార్ సెలవులు ప్రకటించింది.

ఏపీలో 3 నుంచి హాలిడేస్

మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో ఏపీలోనూ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు (AP Dussehra Holidays) ప్రకటించింది. అక్టోబర్​ 3వ తేదీ (గురువారం) నుంచి 13వ తేదీ వరకు సెలవులు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్​ 14న స్కూళ్లు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. ఇంకొక రోజు స్కూల్ వెళ్తే హాయిగా పదిరోజుల వరకూ ఎంజాయ్ చేయొచ్చని సంబుర పడుతున్నారు.

Share post:

లేటెస్ట్