SBI Jobs : 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ.. ఇలా ఈజీగా అప్లై చేసుకోండి

Mana Enadu : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ – రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 1,511 స్పెషలిస్ట్‌ కేడర్‌ (SBI Special Officer) ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 14వ తేదీన ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మరో మూడ్రోజుల్లో ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు (SBI Job Applications) చేయాలనుకునే వారు బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ విభాగాల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

అర్హత రుసుం వివరాలు ఇవే

2024 జూన్‌ 30 నాటికి డిప్యూటీ మేనేజర్ (SBI Deputy Manager) పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల వయసు మించకూడదు. మరోవైపు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే అర్హులు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం.. వేతనం ఇలా

ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది గట్టెక్కిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటి ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక (SBI Job Recruitment) చేస్తారు. ఇక డిప్యూటీ మేనేజర్‌లకు నెలకు రూ.64,820 నుంచి రూ.93,960, అసిస్టెంట్ మేనేజర్‌లకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వేతనం ఉంటుంది.

పోస్టుల వివరాలు

డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ – 187 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ – 412 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ – 80 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఐటీ ఆర్కిటెక్ట్ – 27 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 07 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) – 798 పోస్టులు
మొత్తం పోస్టులు – 1,511 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *