తెలంగాణకు భూకంపం(Earthquake in Telangana) సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్(Earthquake Research & Analysis)’ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు రామగుండం(Ramagundam) సమీపంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకూ ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధ్రువీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.
నిర్ధారించని సమాచారంపై ఆందోళన వద్దు: IMD
TG, AP రాష్ట్రాలు పసిఫిక్ జోన్ 2,3లో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ తక్కువ నుంచి ఓ మోస్తరు భూకంపాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా అవి నష్టం కలిగించలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి నిర్ధారించని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని IMD అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో
కాగా APలో 1969లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1998లో TGలోని ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూంకంపం వచ్చింది. 1984, 1999, 2013లలో హైదరాబాద్(HYD)లో చిన్నచిన్న భూకంపాలు(Earthquakes) సంభవించాయి. భూకంపాల రాకను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని, కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు. అయినా అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
As per our research & analysis #upcoming significant #earthquake possible near #Ramagundam #Telangana south #India #tremors may reach up to near #Hyderabad #Warangal #Amaravathi #AndhraPradesh #Maharashtra
~18.73°N 79.62°E
~10-17 April 2025
~5 #Magnitude pic.twitter.com/COhmgcHcnq— Epic ( Earthquake Research & Analysis ) (@epic_earthquake) April 9, 2025








