ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్

Mana Enadu : రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్.. డార్లింగ్ హీరో.. ప్రభాస్ (Prabhas Birth Day) ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇప్పటికే సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు తన అభిమానులను మరింత అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సలార్-2, కల్కి-2 (Kalki Part 2), రాజాసాబ్, స్పిరిట్ (Spirit Movie), ఫౌజీ సినిమాలతో ప్రస్తుతం డార్లింగ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక అక్టోబర్ 23వ తేదీన ఈ డార్లింగ్ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులకు ఈ పాన్ ఇండియా స్టార్ వరుస సర్ ప్రైజులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

రాజాసాబ్ అప్డేట్స్ ఆరోజే

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న రాజాసాబ్ (Rajasaab Movie Update) సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇంటెన్స్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా ద్వారా తన నటనలోని మరో యాంగిల్ ను చూపించబోతున్నాడట. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి.

ఈశ్వర్ రీ రిలీజ్

ఇక డార్లింగ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్. 22 ఏళ్ల క్రితం ప్రభాస్‌ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్‌ (Eeswar Movie)’ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు  జయంత్‌ సి.పరాంజీ దర్శకత్వంలో  కె.అశోక్‌కుమార్‌ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా  గ్రాండ్‌గా రీ రిలీజ్‌ చేయనున్నారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌’ అంటూ వదిలిన ‘ఈశ్వర్‌’ ట్రైలర్‌ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

 

Related Posts

OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా…

Akhanda2: అఖండ 2 కోసం రికార్డు స్థాయి బడ్జెట్.. బాలయ్య బిగ్ రిస్క్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ  2’ (Akanda2) సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. వరుసగా నాలుగు హిట్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు తన బ్లాక్‌బస్టర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *