I4C నేషనల్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్న

Mana Enadu : డీప్ ఫేక్(Deep Fake).. ఇటీవల ప్రపంచాన్ని ముఖ్యంగా భారత్ ను తీవ్రంగా వణికించింది. ముఖ్యంగా నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఈ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. ఆమెకు మద్దతుగా.. డీప్ ఫేక్ కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, టెక్ నిపుణులు, సాధారణ పౌరులు గళమెత్తారు.  ఆమె తర్వాత మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల డీప్‌ ఫేక్ వీడియోలు కూడా వైరలయ్యాయి. డీప్‌ఫేక్‌లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

డీప్ ఫైక్ పై రష్మిక అవగాహన

ఈ నేపథ్యంలో కేవలం డీప్ ఫేక్ మాత్రమే కాకుండా ప్రస్తుతం దేశంలో పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నటి రష్మిక మందన్న(Rashmika Mandanna)ను ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు చెందిన సైబర్‌ దోస్త్ విభాగం ప్రకటించింది. మరోవైపు రష్మిక కూడా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఐ4సీ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక

‘‘కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కూడా ఓ రకమైన సైబర్ క్రైమే. ఆ చేదు అనుభవం తర్వాత నేను సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయ్యాను. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. తాజాగా మీ ముందుకు ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు (I4C) నేను బ్రాండ్‌ అంబాసిడ(I4C Brand Ambassador)ర్‌ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

సైబర్ క్రైమ్ పై రష్మిక అవగాహన

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  అధ్వర్యంలో ఐ4సీ పని చేస్తుంది. సైబర్‌ నేరస్థులు మనల్ని టార్గెట్‌ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అలర్ట్‌గా ఉండడమే కాదు.. వాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.  సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ బ్రాండ్‌(Indian Cyber Crime Co-Ordination Center) అంబాసిడర్‌గా నేను ఇలాంటి నేరాలపై అవగాహన కల్పిస్తాను. మన దేశాన్ని సైబర్‌ నేరాల నుంచి కాపాడతాను’’ అని రష్మిక ఈ వీడియోలో పేర్కొన్నారు. 

రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్

గతంలో రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో(Rashmika Deep Fake Video) ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన వీడియో వైరల్ అయింది. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక కూడా ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. 

Share post:

లేటెస్ట్