మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు ఇవే

Mana Enadu : మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల (Assembly Election Schedule)కు నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో, జార్ఖండ్​లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్​ 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపింది.  వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు (Lok Sabha By Elections) రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యుల్​ను ప్రకటించారు.

మహారాష్ట్ర ఎన్నికలు

మహారాష్ట్ర(Maharashtra Election Schedule)లో 288 స్థానాలకు ఒకే విడతలో పొలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 9.63 కోట్ల ఓటర్లుండగా.. 1,00,186 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 20.93లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 22
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 29
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 4
  • పోలింగ్ తేదీ నవంబర్ 20
  • ఎన్నికల ఫలితాలు నవంబర్ 23

జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్

జార్ఖండ్ (Jharkhand Election Schedule)​లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2.69 కోట్ల ఓటర్లుండగా.. 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

మొదటి విడత:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 18
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 25
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 28
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
  • పోలింగ్ తేదీ నవంబర్ 13

రెండో విడత:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 22
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
  • పోలింగ్ తేది నవంబర్ 20
  • ఎన్నికల ఫలితాలు నవంబర్ 23

ఉపఎన్నికలు ఎక్కడెక్కడంటే

దేశంలోని 47 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని వయనాడ్ (Wayanad MP By Poll) పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్ 13న​ పోలింగ్​ జరగనుంది. 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 18
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 25
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 30
  • పోలింగ్ తేదీ నవంబర్ 13

ఉత్తరాఖండ్​లోని ఒక అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్​ పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్​ 20న పోలింగ్ జరగనుంది.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 22
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 29
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 4
  • పోలింగ్ తేదీ  నవంబర్ 20
  • ఫలితాలు నవంబర్ 23

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *