మన ఈనాడు:ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు
ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలు తెలుగులోకి రిలీజవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఇతర భాషా సినిమాల సందడి ఎక్కువగా ఉంది. మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అలా కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగు వెర్షన్‌లో. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఒరిజనల్ వెర్షన్‌లో రిషబ్ శెట్టి, రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్ భాస్కర్, యాంకర్ రష్మీ గౌతమ్ పోషించడం విశేషం. దీంతో బాయ్స్ హాస్టల్ మూవీకి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో యూత్‌ను తెగ ఆకట్టుకున్న బాయ్స్ హాస్టల్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో శుక్రవారం (నవంబర్ 10) ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ అవుతోంది.