మన ఈనాడుః పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ బాగానే ఉంటుంది. పాత కథలే అయినా.. కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పుడు కొత్త దర్శకుడు మారేష్ శివన్ అలా నిన్ను చేరి అంటూ వచ్చాడు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు ఈ సినిమాలో. మరి ఈ చిత్రం ఎలా ఉంది..?
మూవీ రివ్యూ: అలా నిన్ను చేరి.. ఓ దర్శకుడి ప్రేమ ప్రయాణం..
నటీనటులు: దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్, ఝాన్సీ, శత్రు తదితరులు
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
నిర్మాత: కొమ్మాలపాటి సుధాకర్
దర్శకుడు: మారేష్ శివన్
పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ బాగానే ఉంటుంది. పాత కథలే అయినా.. కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పుడు కొత్త దర్శకుడు మారేష్ శివన్ అలా నిన్ను చేరి అంటూ వచ్చాడు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు ఈ సినిమాలో. మరి ఈ చిత్రం ఎలా ఉంది..?
కథ:
విశాఖపట్నంలోని వెంకటాపూర్ అనే ఓ గ్రామంలో ఉంటాడు గణేష్ (దినేష్ తేజ్). తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏ చీకు చింతా లేకుండా లైఫ్ గడిపేస్తుంటాడు. కానీ ఎంత జాలీగా ఉన్నా దర్శకుడు కావాలనేది ఆయన లక్ష్యం. దానిపైనే ఫోకస్‌గా ఉంటాడు గణేష్. అలాంటి గణేష్ జీవితంలోకి అదే ఊళ్ళో ఉండే దివ్య (పాయల్ రాధాకృష్ణ) వస్తుంది. తొలి చూపులోనే గణేష్‌తో ప్రేమలో పడుతుంది దివ్య. ముందు వద్దన్నా.. తర్వాత దివ్య ప్రేమలో పడిపోతాడు గణేష్. కానీ కెరీర్ గురించి ఆలోచించి ప్రేమలో ఎటూ తేల్చుకోలేకపోతాడు గణేష్ అదే సమయంలో దివ్యకు ఆమె తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ) పెళ్లి సెట్ చేస్తుంది. అప్పుడు గణేష్ ఏం చేసాడు..? అసలు గణేష్ జీవితంలోకి అను (హెబ్బా పటేల్) ఎలా వస్తుంది? అనేది అసలు కథ..
కథనం:
పల్లెటూరి ప్రేమకథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాకపోతే దాన్ని చెప్పే రీతిలో చెప్పాలి.. అప్పుడే రియాక్షన్ కూడా బాగుంటుంది. తాజాగా అలా నిన్ను చేరి సినిమా కూడా ఇదే లిస్టులోకి వస్తుంది. ఓ ఊర్లో నడిచే ప్రేమకథ ఇది.. అలాగే దాంతో పాటు కాస్త సినిమా కష్టాలను చూపించే సినిమా. కొత్త దర్శకుడు మారేష్ శివన్ చాలా క్లియర్‌గా ఒకే సినిమాలో రెండు సపరేట్ కథలు చూపించాడు.. ఇంటర్వెల్ వరకు పల్లెటూరు, ఆ తర్వాత పూర్తిగా సిటీ బ్యాక్‌డ్రాప్.. ఈ రెండింటికి క్లైమాక్స్‌లో ముడి పెట్టాడు దర్శకుడు. తన కథలో ప్యూరిటీ కోసం ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లేకుండా ఉండాలనుకున్నాడు కాబట్టి కథను 15 ఏళ్ళ కిందికి మార్చేసాడు. కథ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు కానీ అక్కడక్కడా బాగానే తీసాడు దర్శకుడు మారేష్. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే పల్లెటూరి సీన్స్ పర్లేదు అనిపిస్తాయి కానీ మధ్యలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు ఇబ్బంది పెడతాయి. సెకండాఫ్ అంతా పూర్తిగా సిటీకే పరిమితం అయిపోయాడు దర్శకుడు. ఫస్టాఫ్ స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఊళ్లోనే కథ నడవడం.. వచ్చిన సీన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఓ అమ్మాయిని ప్రేమించడం.. పెళ్లి సమయంలో కెరీర్ కోసం ఆలోచించడం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సెకండాఫ్‌లో పూర్తిగా హీరోను లక్ష్యానికి పరిమితం చేసాడు. దర్శకుడు కావాలన్న తన కలను ఎలా చేరుకున్నాడనేది ఇక్కడ చూపించాడు. కన్విన్సింగ్‌గా అనిపించదు కానీ అక్కడక్కడా పర్లేదు అనిపిస్తుంది. ప్రేమకు, లక్ష్యానికి మధ్య జరిగే సంఘర్షణలో హీరో పాత్రను బాగా చిత్రీకరించాడు దర్శకుడు మారేష్. హెబ్బా పటేల్ కారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి అమ్మాయిలు మన లైఫ్‌లో ఉంటే బాగున్ను అనేలా ఈ కారెక్టర్ రాసాడు మారేష్.
నటీనటులు:
గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు దినేష్ తేజ్. డాన్సులు బాగా చేసాడు.. అలాగే ఎమోషన్స, యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాడు. పల్లెటూరి అమ్మాయిగా పాయల్ రాధాకృష్ణ అందంగా ఉంది. అక్కడక్కడా గ్లామర్ షో కూడా చేసింది. ఇక హెబ్బా పటేల్ ద్వితీయార్దంలో ఆకట్టుకుంటుంది. ఈమెను పూర్తిగా గ్లామర్ కోణంలోనే చూపించాడు దర్శకుడు. మిగిలిన పాత్రల్లో రంగస్థలం మహేష్, బాషా, అనశ్వి, ఝాన్సీ, కల్పలత, శత్రు ఇలా అందరూ చక్కగా నటించారు.
టెక్నికల్ టీం:
సుభాష్ ఆనంద్ సంగీతం ఓకే.. పాటలు పర్లేదు. రీ రికార్డింగ్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. అక్కడక్కడా నిడివి ఎక్కువైనట్లు అనిపించింది. దర్శకుడి నిర్ణయం కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొదటి సినిమానే అయినా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. దర్శకుడు మారేష్ శివన్ కథ బాగానే రాసుకున్నాడు కానీ అక్కడక్కడా తడబడ్డాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది.. సెకండాఫ్ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది.
పంచ్ లైన్:
అలా నిన్ను చేరి.. ఇటు ప్రేమ.. అటు లక్ష్యం.. మధ్యలో సినిమా కష్టాలు..